- Advertisement -
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 14,989 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 13,123 మంది బాధితులు డిశ్చార్జ్ కాగా, కోవిడ్ తో మరో 98 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,39,516కు పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,57,346 మంది కరోనాతో మృతి చెందారు. ఇండియాలో 1,08,12,044 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం 1,70,126 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 1,56,20,749 మందికి కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
14989 New Covid-19 Cases Reported in India
- Advertisement -