- Advertisement -
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు(యుటి) ఇప్పటివరకు 116.54 కోట్ల డోసుల మేరకు కొవిడ్-19 వ్యాక్సిన్లను కేంద్రం సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. రాష్ట్రాలు, యుటిల వద్ద ఇప్పటికీ 15.69 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ నిరుపయోగంగా మిగిలి ఉందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తరించడంతోపాటు మరింత వేగంగా నిర్వహించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, యుటిలకు ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అందచేస్తోంది.
- Advertisement -