Monday, December 23, 2024

మూసీ నదిపై 15 వంతెనల నిర్మాణానికి రంగం సిద్ధ్దం

- Advertisement -
- Advertisement -

Plans to build check dams and bridges over the musi river

మన తెలంగాణ /సిటీ బ్యూరో : నగరవాసులకు మరింత సులభతరమైన ర వాణా మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధ్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధ్దం చేసిన విషయం తెలిసి ందే. ఇందులో భాగంగా నగరం నడి మధ్య నుంచి ప్రవహిస్తున్న మూసీ నది రెండు దరులను కలుపుతూ15 కొత్త బ్రిడ్జిలను నిర్మాణాలకు అదేశా లను జారీ చేసింది. దీంతో మూసీ, ఈసీ నదులపై సుధీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఈ బ్రిడ్జిలను నిర్మాణాలకు మార్గం సుగమమైంది. మూసీ, ఈసీ నదిపై వివిధ ప్రాంతాల్లో 15 వంతెనలను నిర్మించేందుకు గాను రూ.545 కోట్లు విలువైన పనులకు శనివారం ప్రభుత్వం పరిపాలన అను మతులను జారీ చేసింది. హైదరాబాద్ రోడ్ డవలఫ్‌మెంట్ కార్పోరేషన్ లి మిటెడ్ నిర్మాణ పనులను పర్యవేక్షించనుంది. 15 వంతెనల నిర్మాణ ఖర్చు ను హెచ్‌ఎండిఎ 50 శాతం, మరో 50 శాతం నిధులను జిహెచ్‌ఎంసి భరి ంచాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అయితే నిర్మాణ ఏజెన్సీలను మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సె క్రటరీ ఖరారు చేయాల్సిందిగా ఆదేశాలను వెలువరించింది.

రూ. 545 కోట్లతో 15 వంతెనల నిర్మాణం
క్ర.సంఖ్య ప్రాంతం వ్యయం
1. మూసీనదిపై అప్జల్ గంజ్ వద్ద పాదచారులకు ప్రత్యేక బ్రిడ్జి రూ.40 కోట్లు
2. మూసీపై కారిడార్ 99లో హైలెవల్ బ్రిడ్జి రూ.52 కోట్లు
3. ఇబ్రహీం బాగ్ కాజ్‌వే వద్ద హై లెవల్ బ్రిడ్జి రూ.39 కోట్లు
4. సన్ సిటీ-చింతల్‌మెట్ (పవర్ కారిడార్)ఈసీ నదిపైహైలెవల్ బ్రిడ్జి రూ.32 కోట్లు.
5. బండ్లగూడ జాగీర్‌లోని కిస్మాత్‌పురావద్ద ఈసీనదిపై హైలెవల్ బ్రిడ్జి రూ.32.కోట్లు
6. ముసారంబాగ్ వద్ద కనెట్టింగ్ హైలెవల్ బ్రిడ్జి రూ.52కోట్లు
7. చాదర్‌ఘాట్ వద్ద కనెట్టింగ్ హైలెవల్ బ్రిడ్జి రూ.42కోట్లు
8. అత్తాపూర్ వద్ద మూసీపై కొత్త హైలెవల్ బ్రిడ్జి రూ.35కోట్లు
9. ఉప్పల్ లేఅవుట్ కనెట్టింగ్ గాను మూసీపై కొత్త బ్రిడ్జి రూ.42కోట్లు
10 మంచిరేవుల, నార్సింగి కనెట్టింగ్ గాను హైలెవల్ బ్రిడ్జి రూ.39కోట్లు
11. బుద్వెల్ (ఐటి పార్కు) కనెట్టింగ్ గాను హైలెవల్ బ్రిడ్జి రూ.32 కోట్లు
12 హైదర్‌షా కోట్ల, రాందేవ్‌గూడ మధ్య కనెట్టింగ్ గాను హైలెవల్ బ్రిడ్జి రూ.42కోట్లు
13 బుద్వేల్ (ఐటి పార్కు) కనెట్టింగ్ గాను ఈసీ నదిపై మరో హైలెవల్ బ్రిడ్జి రూ.42కోట్లు
14. ప్రతాప సింగారం, గౌరెల్లి మధ్య మూసీపై హైలెవల్ బ్రిడ్జి రూ.35 ఓట్లు
15. న్యూ లింక్ రోడ్డుకు అనుసంధానంగా మంచిరేవుల వద్ద హైలెవల్ బ్రిడ్జి రూ.11 కోట్లు
16. మొత్తం రూ.545 కోట్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News