Monday, December 23, 2024

డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్…

- Advertisement -
- Advertisement -

15 Businessmen identify in drug case
హైదరాబాద్: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు వ్యాపారవేత్తలు గజేంద్ర, విపుల్‌ల కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో బడా వ్యాపారవేత్తలుగా గజేంద్ర, విపుల్‌గా కొనసాగుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా టోనీ దగ్గర నుంచి ఈ ఇద్దరు వ్యాపారులు డ్రగ్స్ తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో రూ.500 కోట్లకు పైచిలుకు డ్రగ్స్ అమ్ముతున్నట్టు సమాచారం. మరో 15 మందికి టోనీ డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించి, వారి వివరాలను సేకరిస్తున్నారు. రాజకీయ, వ్యాపార, సినీరంగాలకు చెందినవారై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News