Monday, December 23, 2024

15 మంది సిబిఐ అధికారులకు హోంమంత్రి పతకాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దర్యాప్తులో అద్భుతమైన పని తీరును కనబర్చినందుకుగాను కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)కు చెందిన 15 మంది అధికారులకు 2023 సంవత్సరానికిగాను కేంద్ర హోంమంత్రి పతకాలను ప్రదానం చేయనున్నట్లు సిబిఐ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయిన అధికారుల్లో ఎస్‌పి విద్యుత్ వికాస్, ఎఎస్‌పి తథాగత్ వర్ధన్, డిఎస్‌పిలు ముకేశ్ కుమార్, అలోక్ కుమార్ షాహి, రుబీ చైదరి, దీపక్ కుమార్ పురోహిత్, అఖిల్ పాండే, ఇన్‌స్పెక్టర్లు హుకమ్ వీర్ అత్రి, దినేశ్‌కుమార్, జహీర్ అఖ్తర్ అన్సారీ, శీతల్ అరుణ్ షెండ్జే, కమలేశ్ చంద్ర తివారీ, రాహుల్ రాజ్,మ్బ్రహ్మణ్యం లక్ష్మీ వెంకట గాలి, సంతోష్‌కుమార్ అరేకఠ్‌లున్నారని ఆ ప్రకటన తెలిపింది. దర్యాప్తులో అద్భుతమైన పని తీరును కనబరిచినందుకు కేంద్ర దర్యాప్తు ఏజన్సీలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు ఇన్వెస్టిగేటింగ్ ఏజన్సీల సభ్యుల కోసం హోంమంత్రిత్వ శాఖ ఈ అవార్డును ఏర్పాటు చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News