Monday, December 23, 2024

వన్య ప్రాణిని చంపిన వ్యక్తికి 15 రోజుల రిమాండ్

- Advertisement -
- Advertisement -

జన్నారం: జన్నారం రేంజ్ చింతగూడ గ్రామానికి చెందిన పానగంటి శ్రీను అనే వ్యక్తి కవ్వాల్ సంరక్షణ కేంద్రంలో గల చింతగూడ బీట్‌లో బెం గాల్ మానిటర్ వన్య ప్రాణిని వేటాడి చంపినందుకు మంగళవారం అరెస్టు చేసి లక్షెట్టిపేట కోర్టులో హాజరుపర్చి జైలులోకి పంపించడం జరిగింద ని స్థానిక రేంజ్ ఆఫీసర్ లక్ష్మినారాయణ తెలిపారు.

నిందితుడు శ్రీనుకు మెజిస్ట్రేట్ 15 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. వన్య ప్రాణుల ను వేటాడితే కటకటాలు అనుభవించక తప్పదని, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. చింతగూడ సెక్షన్ ఆఫీసర్ శివకుమార్, బీట్ ఆఫీసర్ శ్రీనివాస్‌లు నిందితుడు పానుగంటి శ్రీనును జైలుకు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News