- Advertisement -
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో మంగళవారం ఉదయం వంతెనపై నుంచి బస్సు పడిపోవడంతో 15 మంది మృతి చెందగా, 20 నుంచి 25 మంది వరకు గాయపడ్డారని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ ఘటన ఉదయం 8.40 గంటలకు జరిగింది. డొంగర్ గ్రామ్ సమీపంలోని బోరాడ్ నది బ్రిడ్జిపై నుంచి బస్సు పడిపోయింది. నది అక్కడ ఎండిపోయి ఉంది. ‘ఈ ప్రమాదంలో పదిహేను మంది మరణించారు, దాదాపు 20 నుంచి 25 మంది గాయపడ్డారు’ అని మంత్రి విలేకరులతో అన్నారు. క్షతగాత్రులను ఖార్గోన్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు కూడా ఆయన తెలిపారు.
- Advertisement -