Wednesday, January 22, 2025

తాగుబోతు చేతిలో లైటర్

- Advertisement -
- Advertisement -

రష్యా బార్‌లో మంటలు… 15 మంది మసి

మాస్కో : రష్యాలోని కోస్ట్రోమా నగరంలోని పోలిగన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో చెలరేగిన మంటలలో కనీసం 15 మంది సజీవ దహనం చెందారు. 250 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. నగరంలో పాపులర్ అయిన ఈ బార్‌లో మంటలకు ఓ తాగిన వ్యక్తి దుశ్చర్య కారణం అని టాస్ వార్తాసంస్థ తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున విందులు వినోదాలు జరుగుతూ ఉండగా మందుకొట్టి ఉన్న ఈ వ్యక్తి డాన్స్ వేదికపైకి గురి చూసి తన మంటలంటుకునే గన్ పేల్చాడు. దీనితో ఒక్క సారి మంటలు చెలరేగాయి. ఒకే అంతస్తులో ఉండే ఈ బార్ ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. వేదికపై మంటలు వ్యాపించడంతో జనంలో హాహాకారాలు చెలరేగాయి. అర్థరాత్రి తరువాత చెలరేగిన మంటలు తెల్లవారుజామున ఏడున్నర ప్రాంతంలో అదుపులోకి తేగలిగారు.

ఘటన గురించి స్థానిక గవర్నర్ సెర్గీ సిట్నికోవ్ విలేకరులకు తెలిపారు. 12 మంది చనిపోయ్యారని , కొందరికి గాయాలు అయ్యాయని చెప్పారు. అయితే రంగంలోకి దిగిన అత్యయిక సిబ్బంది మొత్తం 15 మృతదేహాలను కనుగొన్నారు. హాల్‌లోపల నుంచి పలువురిని ఏదో విధంగా బయటకు తీసుకువెళ్లారు. ఈ నగరం మాస్కోకు ఈశాన్యంగా దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాగా తాగి ఉన్న వ్యక్తి మత్తులో తన చేతిలోని ఫ్లేర్‌గన్‌ను పేల్చాడని, ఇదే మంటలు వ్యాపించడానికి కారణం అయి ఉంటుందని సహాయక సిబ్బంది తెలిపింది. ఈ వ్యక్తి బార్‌కు ఓ మహిళతో కలిసి వచ్చాడు. ఆమె కోసం పూలు తెచ్చిపెట్టాలని బేరర్‌ను ఆదేశిస్తూ మరో చేతితో లైటర్‌ను వెలిగించాడని వెల్లడైంది. పొద్దటి పూట హోటల్‌గా రాత్రిపూట క్లబ్‌గా బార్‌గా ఉండే ఈ పొలిగన్ పై కప్పు నుంచి కూడా మంటలు చాలా సేపటివరకూ చెలరేగాయని తెలిపే వీడియోలు నెట్‌లో పొందుపర్చారు. రష్యాలోని అతి పురాతన నగరాలలో ఈ కోస్ట్రోమా ఒకటి. ఇక మధ్యయుగపు కాలం నాటి నిర్మాణాలు, శిల్పాలు, చారిత్రక ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News