Wednesday, January 22, 2025

యుపి బస్సు ప్రమాదంలో 15 మంది తెలంగాణ యాత్రికులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్ లోని భడోహి జిల్లా యుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగిఉన్న ట్రక్కును బస్సు ఢీకొని 15 మంది తెలంగాణ భక్తులు గాయపడ్డారు. గురువారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. బస్సుడ్రైవర్ అదుపుతప్పడంతో ట్రక్కును ఢీకొంది. గాయపడిన 15 మందిలో ఐదుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వారణాసి లోని ఆస్పత్రికి తరలించినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేష్ ప్రతాప్ సింగ్ చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News