Tuesday, January 21, 2025

ఎంఎల్ఎలుగా 15 మంది డాక్టర్లు

- Advertisement -
- Advertisement -

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో 15మందికి పైగా డాక్టర్లు, నలుగురు ఇంజనీర్లు గెలవడం విశేషం. డాక్టర్లుగా బిజీ బిజీగా ప్రాక్టీస్ చేస్తూ, ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించినవారిలో డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు (ఎంఎస్ సర్జన్)- సిర్పూరు, డాక్టర్ మురళీనాయక్ (ఎంఎస్ సర్జన్)- మహబూబాబాద్, డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి (పిల్లల వైద్యుడు)- నారాయణఖేడ్, డాక్టర్ రామచంద్రునాయక్ (ఎంఎస్ సర్జన్)- డోర్నకల్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (ఎంఎస్ సర్జన్)- మానకొండూరు, డాక్టర్ మైనంపల్లి రోహిత్ (ఎంబీబీఎస్)- మెదక్, డాక్టర్ సంజయ్ కుమార్ (ఆఫ్తల్మాలజిస్ట్)- జగిత్యాల, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ (ఎంఎస్ సర్జన్)- అచ్చంపేట, డాక్టర్ మట్టా రాగమయి (పల్మనాలజిస్ట్)- సత్తుపల్లి, డాక్టర్ సంజయ్ (న్యూరాలజిస్ట్)- కోరుట్ల, డాక్టర్ తెల్లం వెంకటరావు (ఆర్థోపిడీషియన్)- భద్రాచలం, డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి (డెంటిస్ట్)- నాగర్ కర్నూల్, డాక్టర్ గడ్డం వివేక్ (ఎంబీబీఎస్)- చెన్నూరు, డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి (రేడియాలజిస్ట్)-నారాయణపేట, డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి (పీడియాట్రీషియన్)- నిజామాబాద్ రూరల్ ఉన్నారు.

ఇక ఇంజనీర్ల జాబితాలో కేవీ వివేకానంద్, యశస్వినీరెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంతరెడ్డి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News