Wednesday, January 22, 2025

ఇండస్ట్రీలో 15 గోల్డెన్ ఇయర్స్ పూర్తి చేసుకున్న నేచురల్ స్టార్ నాని

- Advertisement -
- Advertisement -

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగారు నాని. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి నుంచి నాచురల్‌ స్టార్‌గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకొని, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

నేటితో ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు నాని. నాని కథానాయకుడిగా పరిచయమైన ‘అష్టా చమ్మా’ సినిమా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. తన అద్భుతమైన నటనతో తొలి సినిమాతో ప్రేక్షకుల మనసులో ముద్రవేసుకున్నారు నాని. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.

15 ఏళ్ల సినిమా ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలతో అద్భుతమైన విజయాలతో ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్నారు నాని. ‘దసరా’తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. ప్రస్తుతం మరో పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘హాయ్ నాన్న’ చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News