Monday, December 23, 2024

15 మంది భారతీయ మత్సకార్మికులు శ్రీలంకలో అరెస్టు

- Advertisement -
- Advertisement -

కొలంబో : శ్రీలంక పరిధి లోని సాగర జలాల్లో అక్రమంగా చేపలు వేటాడుతున్నారన్న నేరారోపణపై 15 మంది భారతీయ మత్స కార్మికులను శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. ఈనెల 8 వ తేదీ రాత్రి రెండు ట్రాలర్లలో వీరు అక్రమంగా తమ పరిధి లోకి ప్రవేశించి చేపలను వేటాడుతుండగా పట్టుకున్నామని శ్రీలంక నేవీ ప్రకటించింది. అరెస్టయిన వారిని , ట్రాలర్లతో సహా కంకేసందురై హార్బర్‌కు తీసుకువచ్చి మైలాడి ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పజెప్పినట్టు వెల్లడించింది. గత నెల శ్రీలంక నేవీ 22 మంది భారతీయ మత్సకార్మికులను అరెస్టు చేసింది. వీరంతా తమిళనాడుకు చెందిన వారు. ఈ ఏడాదిలో ఇంతవరకు 74 మంది భారతీయ మత్సకార్మికులను అరెస్టు చేసి 12 ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News