చికాగో:అమెరికాలోని చికాగోలో గారీఫీల్డ్ పార్క్ నైబర్‌హుడ్ ప్రాంతంలో హాలోవిన్ వేడుకలపై వేగంగా వెళుతున్న వాహనంలోంచి జరిపిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు సహా 15 మంది గాయపడినట్లు చికాగో పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో మూడేళ్ల చిన్నారి సహా 13 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారని చికాగో పోలీసు సూపరింటెండెంట్ డేవిడ్ బ్రౌన్ చెప్నారు. కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి గాయపడినట్లు తెలిపారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుందని, అంతా క్షణాల్లో జరిగిపోయిందని బ్రౌన్ చెప్పారు. కాల్పులు జరిగిన వాహనాన్ని పోలీసు నిఘా వీడియోలో గుర్తుపట్టినట్లు ఆయన చెప్పారు. వీడియోలో కనీసం ఇద్దరు షూటర్లున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గాయపడిన వారిలో చాలా మందికి ప్రాణాపాయం లేదని, ఎవరు కూడా చనిపోలేదని బ్రౌన్ చెప్పారు. సోమవారం రాత్రి ఎలాంటి ఘర్షణా జరిగినట్లు సమాచారం లేదని, అయితే పెద్ద ఎత్తున జనం చేరి ఉన్నారని ఆయన తెలిపారు.
15 Injured as Chicago Halloween Shooting