Monday, December 23, 2024

కామారెడ్డిలో పెళ్లి ఆటో బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాడ్వాయి మండలం దేమే గ్రామ శివారులో పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు దవాఖానాకు తరలించారు.

ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సంగోజివాడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పెళ్లి కుమార్తెను సంగోజివాడి తీసుకెళ్తుండగా దేమే గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News