Sunday, December 22, 2024

నారాయణ పేటలో తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నారాయణ పేట: జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం ధార్వాడీ(కర్ణాటక) నుంచి హైదరాబాద్ కు 36మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆరంజ్ ట్రావెల్స్ బస్సు మాగనూరు ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో ఎదురుగా వస్తున్న గేదెను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

15 Injured in Road Accident in Narayanpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News