పలు ఆరోపణలు ఉన్న ఓ ఇన్స్‌స్పెక్టర్‌పై వేటు
మనతెలంగాణ, సిటిబ్యూరో: రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న 15మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వనస్థలిపురం ఇన్స్‌స్పెక్టర్‌ను తక్కువ సమయంలో బదిలీ చేశారు. పిడి సెల్‌లో ఉన్న వెంకటేశ్వర్లును పహాడీషరీప్ ఎస్‌హెచ్‌ఓగా, సత్యనారాయణను మీర్‌పేట డిఐగా పనిచేస్తుండగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. మైత్రీవనంను రామన్న పేట పిఎస్ ఎస్‌హెచ్‌ఓగా,వనస్థలిపురం ఎస్‌హెచ్‌ఓ మురళిమోహన్‌ను సిసిఎస్ మల్కాజ్‌గిరికి, విజయ్‌బాబును వననస్థలిపురం ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్‌గా, రవిబాబును డిఐ సరూర్‌నగర్‌గా, దేవేందర్‌ను సిసిఎస్ ఎల్‌బి నగర్‌కు, కృష్ణ చైతన్యపురి డిఐగా, సత్యనారాయణను మీర్‌పేట డిఐగా, మహేష్‌ను వనస్థలిపురం ట్రాఫిక్1 ఇన్స్‌స్పెక్టర్‌గా, విజయ్‌మోహన్‌ను చౌటుప్పల్ ట్రాఫిక్‌కు, హెచ్. వెంకటేశ్వర్లును డిఐ మల్కాజ్‌గిరి, వెంకటయ్యను సిఐ సెల్, శేఖర్ సిసిఆర్‌బి, మున్నీని సిసిఎస్ ఎల్‌బి నగర్‌కు బదిలీ చేశారు. ఓ ఎస్‌హెచ్‌ఓపై పలు ఆరోపణలు రావడంతో తక్కువ సమయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ వేటువేశారు.