Monday, December 23, 2024

సిరియాలో రాకెట్ దాడి: 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బీరుట్: సిరియాలో టర్కీ మద్దతుగల తిరుగుబాటు దళాల అధీనంంలోని అల్ బాబ్ పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన రాకెట్ దాడిలో 15 మంది పౌరులు మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు. టర్కీ సేనలు జరిపిన వైమానిక దాడిలో 11మంది సిరియా సేనలు, అమెరికా మద్దతుగల కుర్దిష్ దళాలు మరణించిన కొద్ది రోజుల్లోనే ఈ రాకెట్ దాడి జరగడాన్ని ప్రతీకార చర్యగా పరిశీలకులు భావిస్తున్నారు. శుక్రవారం జరిగిన రాకెట్ దాడికి సిరియా ప్రభుత్వానిదే బాధ్యతంటూ సిరియా మానవ హక్కుల పరిశీలకులు ఆరోపించారు. ఈ దాడిలో ముగ్గురు పిల్లలతోసహా 15 మంది మరణించారని, 30 మందికి పైగా గాయపడ్డారని వారు తెలిపారు.

15 Killed in Syria Rocket Attack

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News