Monday, December 23, 2024

ఘోర ప్రమాదం.. ట్రాన్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో విద్యుదాఘాతానికి గురై 15 మంది మృతి చెందారు. మృతుల్లో పోలీస్‌లు కూడా ఉన్నారు. పలువురు గాయపడ్డారు. చమోడీ జిల్లా లోని అలకనందా నది ఒడ్డున ఉన్న నమామీ గంగా ప్రాజెక్టు సైట్ వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలి పోవడం వల్ల వంతెన రెయిలింగ్‌కు విద్యుత్ ప్రవహించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల్లో పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్,హోం గార్డులు ఉన్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

రెయిలింగ్‌కు విద్యుత్ ప్రవాహం జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్టు ఉత్తరాఖండ్ ఏడీజీపీ వి. మురుగేశన్ వెల్లడించారు. పీపల్‌కోటి అవుట్ పోస్ట్ ఇన్‌ఛార్జి కూడా మృతుల్లో ఉన్నారు. గాయపడిన వారిని హెలికాప్టర్‌లో రిషికేశ్ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం మంగళవారం రాత్రి జరిగిందని, చమోలీ ఎస్పీ ప్రమేంద్ర డోబాల్ వెల్లడించారు. వంతెన వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఒకరు విద్యుదాఘాతంతో మృతి చెందినట్టు తమకు సమాచారం అందిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15 మంది మృతి చెందారని, మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం
ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన దీనిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. “ ఇది తీవ్ర దురదృష్టకర సంఘటన. సహాయక చర్యల నిమిత్తం పోలీస్‌లు, విపత్తు నిర్వహణ సిబ్బంది ఘటనాస్థలిలో ఉన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం” అని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రమాదంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్ విభాగం అధికారులు నిర్లక్షంగా వ్యవహరించారని వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News