Sunday, November 17, 2024

ఐటిలో బెంగుళూరుతో పోటీ పడుతున్న నగరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించింది. అందులో భాగంగా ముఖ్యంగా ఐటి, పరిశ్రమల అభివృద్దే లక్షంగా నిర్ణయించుకుంది. ముఖ్యంగా ఐటిపై అధికారులు దృష్టి సారించారు. దీని ద్వారా జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలను ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. అధికారులు పక్కా ప్రణాళికాబద్దంగా ముందుకు పోతుండటంతో ఉమ్మడి ఏపీలో ఐటిలో 1.75 లక్షల ఉన్న ఉద్యోగాలు ఉండగా అవి నేటికి 7.78 లక్షలకు చేరుకుంది. ఐటి ఆధారిత సేవల రంగం ఎగుమతుల, ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 57 వేల కోట్లు ఉన్న ఐటి ఎగుమతులు 202223 నాటికి రూ. 2.41 లక్షల కోట్లకు చేరాయి.

దీంతో ఐటి రంగంలో భారత్‌లో అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక,మహరాష్ట్రతో తెలంగాణ పోటీపడే స్థాయికి చేరుకుంది. బెంగుళూరు, హైదరాబాద్ పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఐటి రంగం వృద్దిలో పోటీపడుతున్నాయి. బెంగుళూరుతో పోలిస్తే స్టార్టప్ వాతావరణం, ఐటీ రంగంలో మౌలిక వసుతుల కల్పన హైదరాబాద్‌లో కొంత ఆలస్యంగా పుంజుకున్నా ప్రస్తుతం పెట్టబుడులకు హైదరాబాద్ ప్రత్యేక ఆకర్ణణగా నిలుస్తోంది. దేశ ఐటీ రాజధానిగా బెంగుళూర్‌కు పేరున్నా ఇటీవల కాలంలో ఐటీ పార్కులు, ఎస్‌ఈజెడ్‌లు, హైదరాబాద్‌లో శరవేగంగా ఏర్పాటు అవుతుండటంతో రెండు నగరాల మధ్య ఐటీ ఆధారిత సేవల కంపెనీలను ఆకట్టుకోవడంలో పోటీ నెలకొంది. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం దేశంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 50 లక్షలు ఉండగా బెంగుళూరులో 15 లక్షలు, హైదరాబాద్ 7.78 లక్షలు,తమిళనాడులో 10 లక్షలు, పూనేలో 4 లక్షలు ఐటీ ఉద్యోగులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర రెండో ఐసిటీ పాలసీ (2021 26)లో రూ ః 3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్షంగా పెట్టుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ ఈ లక్షాన్ని రెండు సంవత్సరాలు ముందుగానే అంటే 2024నాటికే చేరుకుంటుంది. దీంతో ఐటి, ఐటీ ఆధారిత సేవల రంగంలో ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో కొత్త లక్షాలను నిర్దేశించునేందుకు ఐటిశాఖ సిద్దమవుతోంది.దేశంలో ఏ ఇతర రాష్ట్రం సాధించని రీతిలో 2022 23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31.44 శాతం వార్షిక వృద్దిరేటు, ఉద్యోగాల కల్పనలో 16.2 శాతం రికార్డు వృద్దిరేటును సాధించింది. దీంతో ఏడాది కాలంలోనే కొత్తగా 1.26 లక్షల ఉద్యోగాలు, ఎగుమతుల్లో 57 వేల కోట్లకు పైగా వృద్ధిని ఐటీ రంగం సాధించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ నుంచి 17.31 శాతం సిఏజిఆర్ ( సమ్మిళిత వార్షిక వృద్ది రేటు)తో వృద్ధి చెందడంతోనే ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.

రాష్ట్ర అవతరణ నాటి పరిస్థితులతో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో నాలుగు రెట్లు, ఉద్యోగాల కల్పనలో మూడు రెట్లు పురోగతి సాధిచంగా మరో మూడు రెట్లు పరోక్ష ఉద్యోగాలు వచ్చినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 202223లో భారత్ ఐటీ ఎగుమతుల్లో 9.36 శాతం ఉంటే తెలంగాణలో మాత్రం 31.44 శాతం పెరిగాయి.2014లో మొత్తం దేశ ఐటీ ఉద్యోగాల్లో ఉమ్మడి ఏపీ వాట 9.83 శాతంగా ఉంటే ప్రస్తుతం కొత్త ఉద్యోగాల కల్పనలో ఒక్క తెలంగాణ వాటా 27.6 శాతం ఉంది. భారత్ గణాంకాలతో పోలిస్తే దేశంలో ఐటీ రంగంలో వచ్చిన కొత్త ఉద్యోగాల్లో తెలంగాణ నుంచి 202122లో 33 శాతం వస్తే 202223లో 44శాతం వచ్చాయి. దేశంలో కొత్తగా వస్తున్న ప్రతి రెండు ఐటీ ఒకటి తెలంగాణ నుంచే వస్తున్నట్లు అంచనా. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2021 22లో దేశం నుంచి రూ.3.95లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరగ్గా, ఇందులో మూడో వంతు కర్ణాటక,మహరాష్ట్ర, తెలంగాణ నుంచి జరుగుతున్నాయి.

భారతీయ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో కర్ణాటక నుంచి 34.02 శాతం, మహరాష్ట్ర నుంచి 20.04 శాతం తెలంగాణ నుంచి 15.6 శాతం చొప్పున జరిగాయి. దేశ వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా ,రాష్ట్ర ప్రభుత్వ ఐటీశాఖ తాజా నివేదిక ప్రకారం తెలంగాణ నుంచి 9.05 లక్షల మంది పని చేస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో బెంగుళూరు తర్వాత రెండో స్థానంలో హైదరాబాద్ ఐటి ఎగుమతుల్లోనూ రెండో స్థానంలో నిలిచే దిశగా దూసుకుపోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News