Monday, December 23, 2024

అభ్యర్థులకు గల్ఫ్ గండం

- Advertisement -
- Advertisement -

కేంద్రం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చేసింది ఏమీ లేదు..  అక్కడి నుంచే స్మార్ట్ ఫోన్లతో ప్రచారం

గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ ప్రవా’స కార్మికులు, గత పదేళ్ళలో గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్న మరో 15 లక్షల మంది గల్ఫ్ రిటర్నీలు, వారి కుటుంబ సభ్యులు నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభావం చూపనున్నారు. ఒక ప్రవాసికి తన కుటుంబంలో ముగ్గురు, నలుగురు సభ్యులు ఉంటారనుకుంటే ఒక కోటి గల్ఫ్ ఓటు బ్యాంకు ఉన్న్లట్లు భావించవలసి ఉంటుంది. వీరంతా ప్రధాన పార్టీల గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలరు. తమ హక్కులు, సంక్షేమం కోసం గల్ఫ్ కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చేస్తున్న పోరాటం ఇప్పుడు రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో ‘గల్ఫ్ గండం పొంచి ఉన్నదా.. అని పలువురిలో చర్చ కొనసాగుతోంది. భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తూ దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న గల్ఫ్ కార్మికులు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా తమ గల్ఫ్ సంఘాల నేతలను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించారు. సిరిసిల్ల నుంచి గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అధ్యక్షులు దొనికెని క్రిష్ణ ఇండిపెండెంట్‌గా టీవీ రిమోట్ గుర్తుతో మంత్రి కేటీఆర్‌తో తలపడుతున్నా రు. నేతాజీ స్థాపించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్లపై సింహం గుర్తుతో నాలుగు నియోజకవర్గాల్లో గల్ఫ్ లీడర్స్ రంగంలో ఉన్నారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ (వేములవాడ), గల్ఫ్ కార్మికులు, చెరుకు రైతులు, బీడీ కార్మికుల ఉమ్మడి అభ్యర్థి చెన్నమనేని శ్రీనివాస్‌రావు (కోరుట్ల), ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల (నిర్మల్), గల్ఫ్ జెఏసి రాష్ట్ర కార్యదర్శి బూత్కూరి కాంత (ధర్మపురి) నుంచి పోటీలో ఉన్నారు.

గల్ఫ్ నుంచి గ్రామాలకు కాల్స్
ఐదు స్థానాల్లో పోటీలో ఉన్న గల్ఫ్ సంఘాల నాయకులకు ఓటు వేసి గెలిపించాలని సౌదీ అరేబియా, యూఏఈ (దు బాయి),ఓమాన్ (మస్కట్), కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ దేశాలతో పాటు సింగపూర్, మలేసియా తదితర దేశాల నుంచి గ్రామాలలోని తమ కుటుంబ సభ్యులకు పెద్దఎత్తున వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, జూమ్, బోటిమ్, ఐఎంఓ లాంటి యాప్ లతో ఆడియో,వీడియో కాల్స్ చేస్తున్నారు. రాజకీయ యుద్ధానికి స్మార్ట్ ఫోన్లు ఆయుధాలుగా మారాయి. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న వారు, గల్ఫ్ రిటనీ లు కలిసి విలేజ్ డయాస్పోరా (గ్రామ ప్రవాసి) వాట్సప్ గ్రూపుల ద్వారా రాజకీయంగా సంఘటితమవుతున్నారు. వివిధ దేశాలలో నివసిస్తున్న వలస కార్మికులు ప్రత్యక్షంగా ఒకరినొకరు కలు సుకోవడం వీలు కానందున వాట్సాప్ గ్రూపులను రాజకీయ వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు.

గల్ఫ్ ఓటరు ఎవరి వైపు
గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న ముధోల్, ఖానాపూర్ (ఎస్టీ), చొప్పదండి (ఎస్సీ), బాల్కొండ, ఆర్మూర్, జగిత్యాల, ఎల్లా రెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్‌లతో పాటు గల్ఫ్ వలసలు ఒక మోస్తరుగా ఉన్న ఆదిలాబాద్, మంచిర్యాల, కరీం నగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు (ఎస్సీ), నిజామాబాద్ అర్బన్, బోధన్, పెద్దపల్లి, దేవరకద్ర, మక్త ల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగిలలో గల్ఫ్ ఓటు బ్యాంకు ఎవరివైపు మొగ్గు చూపుతుంది అనే చర్చ నడుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో గల్ఫ్ సంఘాల నాయకులు పోటీలో లేనందున, గల్ఫ్ సంఘా లు ఎలాంటి పిలుపు ఇస్తారో అని కాంగ్రెస్, బీజేపీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

(కోల తిరుపతి/మన తెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News