పెద్దేముల్: కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృత్యువాత పడిన విషాదకర సంఘటన మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా.. పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ గ్రామానికి చెందిన బల్ల ఆశప్ప గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తన వద్ద సుమారుగా 80 గొర్రెలు, 15 గొర్రెపిల్లలు ఉన్నాయి. ఎప్పటివలే ఆశప్ప గొర్రె పిల్లలను ఇంటి సమీపంలోని షెడ్డులో ఉంచి, గొర్రెలను మెపేందుకు పొలాలకు వెళ్ళాడు.
మధ్యాహ్నం ఎవరులేని సమయంలో ఊర్లో ఉన్నటువంటి కుక్కలు ఒక్కసారిగా గొర్రె పిల్లలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి హతమార్చాయి. 15 గొర్రె పిల్లలను అతి కిరాతకంగా చంపేశాయి. విషయం తెలుసుకున్న గొర్రెల కాపరి ఆశప్ప భార్య లక్ష్మీగొర్రె పిల్లల షెడ్డు వద్దకు చేరుకుంది. అప్పటికే 15 గొర్రె పిల్లలు మృతి చెందాయి. దీంతో ఒక్కసారిగా రైతు బల్ల ఆశప్ప, భార్య లక్ష్మీ బోరున విలపించి కన్నీరుమున్నిరై రోధించారు.
కుక్కల దాడిలో తమకు జరిగిన నష్టానికి ప్రభుత్వం సహయం చేసి ఆదుకోవాలని రైతు బల్ల ఆశప్ప, భార్య లక్ష్మీ కోరుతున్నారు.