Wednesday, January 22, 2025

నిత్య పెళ్లి కొడుకు… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 పెళ్లిళ్లు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పెళ్లి పేరుతో 15 మంది మహిళలను నిత్యపెళ్లి కొడుకు మోసం చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని బనశంకరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహేష్ అనే వ్యక్తి(35) షాదీ డాట్ కామ్‌లో తాను వైద్యుడిగా పని చేస్తున్నానని పెళ్లి చేసుకుంటానని హేమలత(30)కు మాయమాటలు చెప్పాడు. మైసూర్ తాను ఉంటున్న అద్దె ఇల్లును చూపించి తనదేనని చెప్పాడు. విశాఖపట్నంలో హేమలత, మహేష్ పెళ్లి చేసుకొని మైసూరులో కలిసి జీవనం సాగిస్తున్నారు. క్లినిక్ పెట్టాలి రూ.70 లక్షల నగదు కావాలని హేమలతను అడిగాడు.

Also Read: రాష్ట్రంలో బిజెపికి ఒక్క సీటు దక్కదు: పల్లా

ఆమె నిరాకరించడంతో హత్య చేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతే కాకుండా ఆమె బీరువాలో ఉన్న రూ.15 లక్షల రూపాయలతో పారిపోయాడు. మహేష్ మోసం చేసి దివ్య అనే మహిళ కూడా హేమలతకు తోడు కావడంతో ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా 15 మంది మహిళలను మోసం చేసినట్టుగా గుర్తించారు. అతడి వద్ద నుంచి రెండు లక్షల నగదు, రెండు కార్లు, ఏడు చరవాణులు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మాట్రమోని వెబ్‌సైట్లలో అన్ని వివరాలు తెలుసుకున్న తరువాత ముందుకు వెళ్లాలని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News