Saturday, September 14, 2024

ఎల్ఎన్ బార్ లో కాల్పులు: 15 మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజ్ గిరి: గత బుధవారం అర్థరాత్రి గాజుల రామారం ఎల్ఎన్ బార్ సమీపంలో జరిగిన గొడవలో కాల్పులు జరిపిన ముఖ్య నిందితుడు నరేష్ తో పాటు మరో 14 మందిని పట్టుకున్నామని బాలానగర్ డిసిపి కోటిరెడ్డి తెలిపారు. జీడిమెట్ల పోలిస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు పోలీసులు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా డిసిపి కోటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వారి వద్ద నుండి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీతో పాటు 87 రౌండ్ల బుల్లెట్లు, మూడు కార్లు, ఒక ద్వి చక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నరేష్ అనే వ్యక్తి పై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో నాలుగు కేసులు, సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు ఉన్నాయని వివరించారు. నిందుతుడు నరేష్ ను పట్టుకున్న తరువాత పలు భూవివాదాల్లో బాధితులను బెదిరించినట్టుగా గుర్తించామని, భయబ్రాంతులకు గురి చేశాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. గాజుల రామారం దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో రెండు రౌండ్లు కాల్పులు జరిపారని, అతనికి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా నెల రోజుల క్రితం బీహార్ నుండి దొంగతనంగా తుపాకీతో పాటు 100 బుల్లెట్లు నరేష్ కొనుగోలు చేశారని డిసిపి తెలియజేశారు. అతడిపై రౌడీ షీట్ తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News