Sunday, December 22, 2024

జింకల వేటగాళ్లు మరో 15 మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

వీరంతా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల వాసులే..

మన తెలంగాణ / హైదరాబాద్ : వణ్య ప్రాణులను వేటాడే మరింత మంది వేటగాళ్లను రాష్ట్ర అటవీశాఖ సిబ్బంది అరెస్టు చేశారు. ‘క్యాచ్ ది ట్రాప్‘ ప్రచారంతో భాగంగా వారు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు అటవీ సిబ్బంది క్రమం తప్పకుండా పొలంలో తిరుగుతూ యాంటీ ఎలక్ట్రోక్యుషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ సిబ్బందికి అందిన పక్కా సమాచారం మేరకు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన జాదవ్ బాలు అనే నేరస్తుడు ఇంటికి వెళ్లగా 2 కిలోల జింక మాంసం దొరికింది.

ఈ ఘటనలో ప్రధాన నిందితులు రాజేష్, బుగ్గయ్య, దినేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ క్షేత్రాల చుట్టూ ఉన్న విద్యుత్ లైన్లను వారు ట్యాప్ చేయడంతో పాటు రెండు చుక్కల జింకలు చిక్కుకుని మృతి చెందినట్లు విచారణలో గుర్తించారు. అనంతరం దర్యాప్తులో ఈ కేసులో మొత్తం 31 మంది సభ్యులు ఉన్నట్లు తేలింది. వారిలో 15 మంది ప్రధాన నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో మేజిస్ట్రేట్ 15 మంది నేరస్థులకు రిమాండ్ విధించారు. అనంతరం వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కోసం ఆసిఫాబాద్ సబ్ జైలుకు పంపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News