Friday, November 22, 2024

బంగారం గనిపై విరిగిపడిన కొండచరియలు…. ఇండోనేషియాలో 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పడంగ్(ఒండోనేషియా): సుమత్రా దీవిలో అక్రమంగా బంగారం తవ్వకాలు జరుగుతున్న గనిపై కొండ చరియలు విరిగిపడడంతో 15 మంది మరణించగా అనేక మంది గల్లంతయ్యారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్సులోని మారుమూల ఉన్న సొలోక్ జిల్లాలో బంగారు రేణువుల కోసం గురువారం గామ్రస్తులు తవ్వకాలు జరుపుతుండగా సమీపంలోని కొండలపై నుంచి మట్టి దిబ్బలు వారిపై విరిగిపడ్డాయి. కొండ చరియల కింద కనీసం మరో 25 మంది చిక్కుకుపోయారని స్థానిక విపత్తు నిర్వహణా ఏసంస్థ అధికారి ఇర్వాన్ ఎఫెండోయ్ తెలిపారు. శిథిలాల నుంచి ముగ్గురు వ్యక్తులను సహాయకులు సజీవంగా బయటకు తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News