Wednesday, January 22, 2025

పాకిస్థాన్‌లో భారీ భూకంపం..15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్‌లో బుధవారం తెల్లవారు జామున సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్థాన్ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 5.7 గా నమోదైనట్టు పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్ ఆగ్నేయ ప్రాంతంలో 98 కిమీ లోతున భూకంపం కేంద్రీకృతమైందని, దాని ప్రకంపనలు ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, స్వాత్, మలకంద్, నార్త్ వజ్రిస్థాన్, పారాచినార్, లోయర్ దిర్, హంగు, చార్‌సడ్డా, స్వాబి ప్రాంతాలకు విస్తరించాయని నేషనల్ సిస్మెక్ మోనిటరింగ్ సెంటర్ వెల్లడించింది. పలుచోట్ల భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

దాదాపు 200 మంది గాయపడినట్టు ఇప్పటివరకు సమాచారం. పాకిస్థాన్‌లో తరచుగా భూకంపాలు భౌగోళిక ఫలకల మార్పు కారణంగా సంభవిస్తుంటాయి. ఈ నెల మొదట్లో కరాచీలో 3.2 భూకంప తీవ్రతతో భూకంపం సంభవించింది. గత మే 2న 2.3 తీవ్రతతో గడాప్ టౌన్, కతోహార్, మలిర్ జిల్లా ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. మార్చి 13న రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3తో పంజాబ్, ఖైబర్‌ఫక్తుంక్వా ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించింది. 2005లో భూకంపానికి 74 వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News