Monday, November 25, 2024

జైలులో సహచర ఖైదీ హత్య కేసులో 15 మందికి ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

15 people sentenced to death by Jharkhand court

జెంషెడ్‌పూర్ : జైలులో సహచర ఖైదీ హత్య కేసులో దోషులుగా తేలిన 15 మంది ఖైదీలకు మరణశిక్ష పడింది. జార్ఖండ్ లోని ఈస్ట్ సింగ్భమ్ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్టు జడ్జి రాజేందర్ కుమార్ సిన్హా ఈ మేరకు తీర్పునిచ్చారు. ఇదే కేసులో మరో ఏడుగురికి 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు నిర్ణయించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 2019 జూన్ 25 న జైళ్లోని ఖైదీల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మనోజ్ కుమార్ సింగ్ అనే ఖైదీ దారి లోనే చనిపోయాడు. ఈ హింసాత్మక ఘటనపై పర్సుదిహ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మరోవైపు ఈ కేసులో ఇద్దరు ఖైదీలు పరారీలో ఉన్నారు. వీరిని వెతికి పట్టుకుని న్యాయస్థానం ముందు ప్రవేశ పెట్టాలని జార్ఖండ్ డీజీపీకి కోర్టు ఆదేశాలిచ్చింది. నిందితుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News