Monday, January 20, 2025

హత్య కేసులో 15మందికి మరణశిక్ష

- Advertisement -
- Advertisement -

ఒక హత్య కేసులో కేరళ కోర్టు 15మందికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పును ప్రకటించింది. అలప్పుజకు చెందిన రంజిత్ శ్రీనివాసన్ అనే బిజెపి నేత 2021 డిసెంబర్ 19న హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)కు చెందిన 15మందికి మావలిక్కర అదనపు జిల్లా కోర్టు జడ్జ్ విజి శ్రీదేవి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

ఈ హత్య పథకం ప్రకారం జరిగిందనీ, నిందితులందరూ శిక్షణ పొందిన హంతక ముఠా సభ్యులని ప్రాసిక్యూషన్ వాదించింది. శ్రీనివాసన్ ను అతని ఇంట్లోనే తల్లి, భార్య, నెలల వయసున్న కూతురు కళ్ల ముందే దారుణంగా హత్య చేయడాన్ని బట్టి చూస్తే నిందితులు దారుణమైన మనస్తత్వం కలిగిన వారని అర్థమవుతోందని పేర్కొంది. ఈ కేసును అతి అరుదైనదిగా భావించి, నిందితులకు మరణశిక్ష విధించాలని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News