Thursday, January 23, 2025

బస్సు బోల్తా..15 మందికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

చేగుంట: చేగుంట మండల కేంద్రంలోని బైపాస్ 44వ జాతీయ రహదారి ఊర చెరువు వద్ద ఎం.ఎస్.ఎన్ కంపెనీకి చెందిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.వివరాలలోకి వెళితే.. స్థానికులు, బస్సు డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట నుండి చిన్న శంకరంపేట మండలం చందంపేట వద్ద ఉన్న ఎంఎస్‌ఎన్ పరిశ్రమకు వస్తుండగా చేగుంట బైపాస్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న టూరిస్టు బస్సు ఢీ కొట్టడంతో ఎం.ఎస్.ఎన్ కం పెనీకి చెందిన ప్రవేటు బస్సు బోల్తా పడింది.

ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. ఈ ఘటనలో రవి శంకర్‌ పరిస్థితి విసమంగా ఉండటంతో అతన్ని 108 అంబులెన్స్‌లో మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరో 15 మందికి స్వల్పంగా గాయాలు అయినాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాపిక్ అంతరాయం కాకుండా చర్యలు తీసుకున్నారు. గాయాలైన వారిని కంపని వారు వచ్చి మరో బస్సులో తీసుకెళ్ళారు. రోడ్డుపై పడిన బస్సును తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News