Saturday, December 21, 2024

ప్రభుత్వ ప్రొటోకాల్ శాఖ ఉద్యోగులకు 15 శాతం ప్రత్యేక అలవెన్సులు మంజూరు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : రాష్ట్ర ప్రభుత్వ ప్రొటొకాల్ శాఖలో విధులు నిర్వహిస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులకు 15 శాతం ప్రత్యేక అలవెన్సులను సర్కార్ మంజూరు చేసింది. నిత్యం 24 గంటలపాటు నగరంలో వివిధ చోట్ల విదులు నిర్వహిస్తున్న వీరికి శ్రమకు తగ్గట్టు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ఛీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు ఉత్తర్వులు వెలువరించారు. దీంతో ఒక్కసారిగా ఉద్యోగుల్లో హర్షాతికేకలు మిన్నంటాయి. చాన్నాళ్లుగా ప్రత్యేక అలవెన్సుల కల్పించాలంటూ ఉద్యోగులు పలు పద్దతుల్లో ప్రభుత్వంపై వత్తిడీ తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రభుత్వంతో మాట్లాడి ఎట్టకేలకు వారికి ప్రత్యేక ఆలవెన్సులు ఇప్పించడంలో కృతకృతులయ్యారు.

ఈ సందర్భంగా ప్రొటొకాల్ శాఖ టీఎన్జీవో యూనిట్ అధ్యక్షుడు డీఎన్ మహేశ్ గౌడ్ సారధ్యంలో ఉద్యోగులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్‌లకు ఘనంగా సత్కరించి మొక్కలు అందజేశారు. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ ఉద్యోగులు సమయం లేకుండా 24 గంటలపాటు విధులు నిర్వహిస్తున్నారు. వారు మరింత బాధ్యతాయుతంగా తమ విదులు నిర్వహించి ప్రభుత్వానికి పేరు ప్రతిష్ఠలు తేవాలని ఆకాంక్షించారు.తమకు అలవెన్సులు ఇప్పించినందుకు రాజేందర్‌ను ఉద్యోగులు అభినందించారు. టీఎన్జీవో కేంద్ర సంఘం సహాధ్యక్షులు ఎం.సత్యనారాయణ గౌడ్, కాస్తురి వెంకటేశ్వర్లు, నగర టీఎన్జీవో శాఖ కార్యదర్శి కాట్కూరి శ్రీకాంత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ శాఖ టీఎన్జీవో యూనిట్ కార్యదర్శి హిమాబిందు, కోశాదికారి జి, శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి టి.శ్రీనివాస్‌రావు, కార్యవర్గ సభ్యులు శశీకళ, రామయ్య, ఇ. సత్యనారాయణ, అక్బర్ హుస్సేన్, రాఖేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News