Sunday, January 19, 2025

కేరళ బిజెపి నేత హత్య కేసులో 15 మంది పిఎఫ్‌ఐ కార్యకర్తలకు మరణ శిక్ష

- Advertisement -
- Advertisement -

అలప్పూజ: కేరళ బిజెపి ఒబిసి విభాగం నాయకుడు, న్యాయవాది రంజిత్ శ్రీనివాస్ హత్య కేసులో మావెల్లికర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 15 మందికి మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఇటీవలి కాలంలో కేరళ చరిత్రలో ఒకేసారి ఇంతమందికి మరణ శిక్ష విధించడం ఇదే మొదటి సారి.బిజెపి నేత, లాయర్ రంజిత్ శ్రీనివాస్‌ను 2021 డిసెంబర్19న ఆయన ఇంట్లోనే కుటుంబ సభ్యుల కళ్లముందే దారుణంగా హత్య చేశారు.పిఎఫ్‌ఐ, సోషల్ డెమోక్రటక్ పార్టీ ఆఫ్ ఇండియా( ఎస్‌డిపిఐ)కి చెందిన సభ్యులు ఇంట్లోకి చొరబడి, శ్రీనివాస్‌ను ఆయన తల్లి, భార్య, చిన్నపిల్లవాడి కళ్ల ముందే దారుణంగా చంపేశారు. ఈ కేసులో దోషులుగా తేలిన 15 మందికి మరణ శిక్ష విధిస్తూ అదనపు జిల్లా జడ్జి విజి శ్రీదేవి మంగళవారం తుది తీర్పు వెలువరించారు.

శిక్ష పడిన వారంతా నిషేధిత పిఎఫ్‌ఐ సంస్థకు చెందిన వారు కావడం గమనార్హం. నిందితుల్లో 8 మందిపై హత్య అభియోగాలు, మిగతా వారిపై కుట్ర ఆరోపణలు రుజువైనట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. వీరంతా శిక్షణ పొందిన ‘కిల్లర్ స్కాడ్’ అని బిజెపి నేతను ఆయన కుటంబ సభ్యుల కళ్ల ముందే దారుణంగా చంపేశారని ప్రాసిక్యూషన్ పేర్కొంది.అత్యంత క్రూరమైన నేరంగా దీన్ని పరిగణించి దోషులకు గరిష్ఠ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరింది.ప్రాసిక్యూషన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం దోషులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.శ్రీనివాస్ హత్య కు ఒక రోజు ముందు ఎస్‌డిపిఐ నాయకుడు కెఎస్ షాన్ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముఠా చంపేసింది. ఈ హత్య జరిగిన కొద్ది గంటలకే శ్రీనివాస్ హత్య జరగడం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News