Thursday, January 23, 2025

గురుకుల పాఠశాలలో 15మంది విద్యార్థులకు కరోనా..

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : తెలంగాణ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుందనే నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న తరుణంలో ఒకే పాఠశాలలో ఒకే రోజున 15 మంది విద్యార్థలు కరోనా బారిన పడిన సంఘటన జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తోంది. విషయం తెలిసిన తల్లితండ్రులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వివరాల్లోకి వెలితే.. మహబూబాబాద్ పాత కలెక్టరేట్ వద్ద ఉన్న గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు భోధిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తి కాగా ఆ విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు.

66 మంది పదో తరగతి విద్యార్థులు రెడ్యాల పాఠశాలలో ఉంటున్నారు. ఆరు నుంచి తొమ్మిది తరగతి వరకు చదువుతున్న 252 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.వీరిలో 51మంది విద్యార్థులు జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులతో బాధ పడుతుండగా వారి ఆరోగ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించే ఏఎన్‌ఎం విషయాన్ని వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ నెల 3వ తేదిన 51మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 4వ తేదిన రిపోర్టులు రాగా వారిలో 15 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. వీరిని ప్రత్యేక గదుల్లో ఉంచి వారి తల్లితండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం అందించారు. తీవ్ర భయాందోళనలకు గురైన పిల్లల తల్లితండ్రులు హుటాహుటిన గురువారం పాఠశాలకు చేరుకున్నారు. 12 మంది విద్యార్థులను వారి వెంట ఇండ్లకు తీసుకెళ్లారని పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపల్ రజిత వివరించారు.

మిగతా ముగ్గురు పిల్లలను ప్రత్యేక గదిలో ఐసోలేషన్‌లో ఉంచి వారికి ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నామని పేర్కోన్నారు. వీరు కాగా జ్వరం వచ్చిన మిగతా పిల్లలు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని వారికి వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా వైద్యాన్ని అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు కూడా పాఠశాలను సందర్శించి విద్యార్థులకు దైర్యం చెప్పారని రజిత చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News