Saturday, January 4, 2025

15 రోజుల్లో 15వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ: రేవంత్

- Advertisement -
- Advertisement -

15 రోజుల్లో 15వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ మంత్రివర్గం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే రూ. 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాలను కూడా ప్రారంభిస్తామన్నారు. ఏడువేల మంది స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలు ఇచ్చి, తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఆదిలాబాద్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ఆదివాసీలను గుండెల్లో పెట్టి చూసుకుంటామన్నారు. ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ పై ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు. ఏడు లక్షలకోట్ల రూపాయల అప్పులు చేశారని, రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ఆరోపించారు. తన కూతురికి, కొడుక్కి, మేనల్లుడికీ పదవులు ఇచ్చుకున్న కేసీఆర్ ఏనాడైనా నిరుద్యోగుల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. పదేళ్లలో కేసీఆర్ అడవిబిడ్డల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News