Monday, January 20, 2025

తాగి దొరికితే రూ.15 వేల జరిమానా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ప్రజానీకం సిద్ధమైంది. పబ్బులు, క్లబ్బులు, బాంకెట్ హాల్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో డిసెంబర్ 31న చాలా సందడిగా ఉంటుంది. ఆరోజు ఎలా ంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 31 సాయింత్రం నుంచే తనిఖీలు చేపట్ట నున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు రూ.15000 వరకు జరిమానా విధించాలని నగర పోలీసులు నిర్ణయించారు. మొదటిసారి డ్రంక్ అండ్ చేసిన వారికి రూ. 10,000 ఫైన్ ఉంటుంది. గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వారికి రూ.15,000 జరిమానా విధిస్తారు. 2 సంవత్సరాల వరకు జైలు శిక్షను పడొచ్చు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. జరిమానాలు, జైలు శిక్షతో పాటు తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా స్వాధీనం చేసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అతి చేస్తే శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

31న పలు ఫ్లైఓవర్లు మూసివేత
న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ఫ్లై ఓవర్లు మూసివేయనున్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్), శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి ఫ్లై ఓవర్, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌లు (1&2), షేక్‌పేట ఫ్లై ఓవ ర్, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్, ఫోరమ్ మాల్- జెఎన్‌టియు ఫ్లై ఓవర్, రోడ్ నెం.45 ఫ్లై ఓవర్, దుర్గం చెరువు కేబుల్ వంతెన, సైబర్ టవర్ ఫ్లై ఓవర్ మూసివేయనున్నారు. ఆదివారం రాత్రి 11 గం టల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ ఫ్లై ఓవర్లను మూసివేస్తారు. ఔటర్ రింగ్ రోడ్, పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేలు కూడా మూసివేస్తారు. అయితే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలను మాత్ర మే అనుమతించనున్నారు. క్యాబ్‌లు, టాక్సీలు, ఆటో-రిక్షాల డ్రైవ ర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని పోలీసులు చెప్పారు. రైడ్‌ను తిరస్కరిస్తే రూ. 500 ఫైన్ వేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News