Wednesday, January 22, 2025

హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  పశ్చిమ బెంగాల్‌లోని హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా మార్గంలో నడిచే ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒడిశా బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్ మొత్తం దెబ్బతింది. ప్రస్తుతం బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అయితే, ఘటన తర్వాత వందలాది మంది కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడి కొన్నిచోట్ల ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టడంతో దాదాపు 50 గంటల తర్వాత మళ్లీ ఈ మార్గంలో రైలు ప్రయాణాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం మరికొన్ని చోట్ల ట్రాక్ పనులు కొనసాగుతుండడంతో హౌరా వైపు రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.ఆదివారం నుంచి బుధవారం వరకు నడిచే 15 రైళ్లను రద్దు చేసినట్లు వివరించింది. అయితే, 12వ తేదీన చెన్నై సెంట్రల్ -షాలిమార్ (ట్రైన్ నం. 12842) ట్రైన్‌ను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రద్దు చేసిన రైళ్లలో ఈ నెల 11వ తేదీన మైసూరు- హౌరా (రైలు నంబర్ 22818), 12వ తేదీన హైదరాబాద్- టు షాలిమార్ (ట్రైన్ నంబర్ 18046), ఎర్నాకుళం- టు హౌరా (ట్రైన్ 22878), సంత్రగా టు చి-తంబరం(22841), హౌరా- టు చెన్నై సెంట్రల్ (రైలు నంబర్ 12839)తో పాటు తదితర రైళ్లను రద్దు చేసినట్లు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పిఆర్‌ఓ రాకేశ్ ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News