Monday, December 23, 2024

యూపిలో దళిత బాలికపై అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

బాలియ: ఉత్తరప్రదేశ్‌లో 15సంవత్సరాల దళిత బాలిక అత్యాచారానికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపిలోని బాలియాలో ఈ సంఘటన జరిగింది. ఓ యువకుడు ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని పోలీసులు మంగళవారం తెలిపారు.

Also Read: దారుణ ఘటన.. పట్టపగలే కాలేజీ విద్యార్థిని కాల్చివేత..

అయితే ఈ సంఘటన నార్హి పోలీస్ స్టేషన్ ఏరియాలో సుమారు ఎనిమిది నెలల క్రితం జరిగిందని డిఎస్‌పి అశోక్ మిశ్రా తెలిపారు. సోమవారం బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు 18ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడు బాలిక గ్రామానికి చెందినవాడని డిఎస్‌పి వివరించారు. ఇండియన్ పీనల్‌కోడ్‌తోపాటు పోక్సో చట్టం, ఎస్‌సి, ఎస్‌టి చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News