Thursday, November 21, 2024

తల్లిదండ్రులు, అన్నను చంపిన 15 ఏళ్ల బాలుడు

- Advertisement -
- Advertisement -

గత రెండేళ్లుగా తాను ప్రేమిస్తున్న అమ్మాయితో పెళ్లి చేయడానికి నిరాకరించారన్న కోపంతో ఒక 15 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతోపాటు సోదరుడిని హత్యచేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో జులై 7-8 రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. నంద్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని కుసుబికల గ్రామంలో సంచలనం సృష్టించిన ఈ మూడు హత్యల ఘటనలో మెడలు కోయడానికి ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నేరాన్ని ఒప్పుకున్న ఆ బాలుడిని అరెస్టు చేశారు. మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన తండ్రి మున్షీ బిండ్(45), తల్లి దేవంతి(40), అన్న రాం ఆశీష్(20)ను తానే గొంతు కోసి చంపివేసినట్లు మైనర్ బాలుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

చాలా రోజుల క్రితమే ఈ ముగ్గురినీ చంపాలని తాను నిర్ణయించుకున్నానని, గడ్డి కోసేందుకు ఉపయోగించే కొడవలిని సంపాదించి దానికి చాలా రోజులుగా పదును పెట్టానని ఆ బాలుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. జులై 7న ఈ ముగ్గురినీ చంపాలని భావించినప్పటికీ ధైర్యం చాలక ఆ పని చేయలేకపోయానని బాలుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తన కుటుంబ సభ్యులు అందరూ నిద్రిస్తుండగా తాను మద్యంతాగి ఆర్థరాత్రి ఒంటిగంటకు తన తండ్రి, తల్లి, అన్న గొంతు కోసి చంపానని అతను చెప్పాడు. హత్యలు చేసిన తర్వాత కొడవలిని కొద్ది దూరంలోని పొలాలలో దాచిపెట్టినట్లు బాలుడు చెప్పాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను ఎవరో హత్య చేశారని గ్రామస్తులకు తెలియచేసేందుకు గట్టిగా కేకలు వేశానని ఆ బాలుడు పోలీసులకు తెలిపాడు. ఆ బులడిని జువెనైల్ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News