Tuesday, January 7, 2025

పట్టాలు తప్పిన హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌..ఇద్దరు మృతి, 150మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్‌పూర్ సమీపంలో హౌరా-CSMT ఎక్స్‌ప్రెస్ 18 కోచ్‌లు పట్టాలు తప్పడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో దాదాపు 150 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది.

హౌరా నుంచి ముంబై వెళ్తున్న రైలు తెల్లవారుజామున 3:45 గంటలకు ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్‌ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు, రెస్క్యూ టీమ్ ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులందరికీ ప్రాథమిక వైద్యం చేసిన రైల్వే సిబ్బంది.. మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News