Monday, December 23, 2024

150 మెడికల్ కాలేజీలకు గుర్తింపు రద్దు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో దాదాపు 150 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు రద్దు కానున్నది. వైద్య కళాశాలలను నియంత్రించే ఈ కమిషన్ ఆయా కళాశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోయినా, నిబంధనలు పాటించకపోయినా, గుర్తింపు రద్దు చేస్తుంది. ఇప్పటికే 40 మెడికల్ కాలేజీలు గుర్తింపును కోల్పోయాయి. ఈ కాలేజీలు తాము నిబంధనల ప్రకారం ప్రమాణాలు పాటిస్తున్నామని కమిషన్ ముందు నిరూపించుకోవలసి ఉంటుంది.

ఈ జాబితాలో గుజరాత్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు. పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల కళాశాలలు ఉన్నాయి. కమిషన్‌కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు దాదాపు నెలరోజుల పాటు పరిశీలించిన తరువాతనే లోపాలను గుర్తించింది. సిసిటివి కెమెరాలు అమర్చక పోవడం, బయోమెట్రిక్ హాజరు సౌకర్యం లోపించడం చాలా ఉద్యోగాలు భర్తీకాకుండా ఖాళీగా ఉండడం తదితర లోపాలు పరిశీలనలో బయటపడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News