- Advertisement -
కాబూల్: ఆఫ్గానిస్థాన్‌లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవత్ర 6.1గా నమోదు అయిందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. పక్టికా ప్రావిన్స్‌లో భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో 155 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు పక్టికా ప్రావిన్స్‌లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. పాకిస్థాన్ సరిహద్దులోని ఖోస్ట్ ప్రాంతానికి 47 కిలో మీటర్ల దూరంలో 51 కిలో మీటర్ల లోతులో భూకంప నాభి ఉందని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -