Thursday, September 19, 2024

మరో 2 లక్షల మందికి రూ. 1500 చొప్పున నగదు జమ

- Advertisement -
- Advertisement -

1500 cash deposit for white ration card holders

 

మరో 2 లక్షల మందికి రూ. 1500 చొప్పున నగదు జమ
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఏప్రిల్ నెలలో రేషన్ తీసుకున్న లబ్దిదారులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన రూ. 1500 నగదును వారి ఖాతాలో జమ చేసిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత నెలలో 74.07 లక్షలు, మే నెలలో 74.35 లక్షల కార్డుదారులకు బ్యాంకుల ద్వారా నేరుగా వారి ఖాతాలో ఒక్కొక్క కార్డుపై రూ. 1500 చొప్పున రూ 2,227 కోట్లు, బ్యాంకు ఖాతాలేని వారికి ఏప్రిల్ నెలలో 5.21 లక్షలు, మే నెలలో 5.38 లక్షల మంది కార్డుదారులకు పోస్ట్ ఆఫీసుల ద్వారా మొత్తం రూ. 158.24 కోట్లు అందజేయడం జరిగిందన్నారు.

తాజాగా వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఏప్రిల్ నెలలో రేషన్ తీసుకున్న 2 లక్షల 8 వేల మందికి ఏప్రిల్, మే రెండు నెలలకు కలిపి ఒక్కొక్కరికి రూ. 3000 చొప్పున మొత్తం రూ. 62 కోట్ల 40 లక్షలను వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. లబ్దిదారులు భౌతిక దూరాన్ని పాటించి నగదును తీసుకోవాలని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉచిత బియ్యానికి సంబంధించి ఇప్పటి వరకు (శనివారం, 23వ తేదీ) 81.49 లక్షల (93.10%) మంది కార్డుదారులకు 3 లక్ష 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 5,187 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేయడం జరిగిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News