Wednesday, January 22, 2025

తాజాగా 1500 కరోనా కేసులు.. 33 మరణాలు

- Advertisement -
- Advertisement -

1500 Covid-19 cases 33 deaths in india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కట్టడిలో ఉంది. రెండేళ్ల కనిష్ఠానికి తగ్గిపోతోంది. దాంతో గత కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ముందు రోజు వలే తాజాగా 1500 మేర కొత్త కేసులు ,30 కి పైగా మరణాలు సంభవించాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం సోమవారం 5.68 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1581 మందికి వైరస్ సోకినట్టు తేలింది. 24 గంటల వ్యవధిలో 33 మరణాలు సంభవించాయి. వైరస్ వ్యాప్తి అదుపులో ఉండడంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

ప్రస్తుతం 23,913 కి తగ్గిపోయాయి. సోమవారం 2741 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. క్రియాశీల రేటు 0.06 శాతానికి తగ్గిపోగా, రికవరీ రేటు 98.74 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 4.30 కోట్ల మందికి కరోనా సోకగా, 4.24 కోట్ల మంది కోలుకున్నారు. 5.16 లక్షల మంది మృతి చెందారు. ఇక టీకా డ్రైవ్‌కు సంబంధించి సోమవారం 30,58,879 మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 181 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా చెలరేగుతుండడంతో దేశంలో 18 ఏళ్లు పైబడినవారందరికీ బూస్టర్ డోసు ఇచ్చే విషయమై కేంద్రం యోచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News