Thursday, December 19, 2024

సికింద్రాబాద్‌లో 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో భారీ స్థాయిలో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ టాస్క్‌ఫోర్స్, బోయినపల్లి పోలీసులు సంయుక్తంగా తయారీ యూనిట్‌పై ఆదివారం దాడి చేశారు. కల్తీ అల్లం వెల్లుల్లు తయారు చేస్తున్న 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా 1500 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ని టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. మరో 4లక్షల 50 వేలు విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. వీరు తయారీలో కెమికల్స్, కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లి వాడుతున్నట్లు తెలిసింది. ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటి నుంచో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సిటీలోని చాలా రెస్టారెంట్ల, హోటల్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు పంపిణీ చేసినట్లు తెలిసింది. నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లే వీరు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. బోయిన్‌పల్లి, రాజరాజేశ్వరి నగర్‌లో ఖార్కానాలో ’సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్’ పేరిట దందా కొనసాగుతోంది.

సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యజమాని మహ్మద్ షకీల్ అహ్మద్ పరారీలో ఉన్నట్లు , అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా గత నెల 8న టాస్క్ ఫోర్స్ బృందం హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లోని కోణార్క్ టీ ప్రాంగణంలో దాడులు నిర్వహించిన సంగతి విదితమే. అక్కడ భారీ ఎత్తున కల్తీ టీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. కోణార్క్ టీ వారు చాపత్తను హైదరాబాద్‌లోని వివిధ టీ స్టాల్స్‌కు ప్యాక్ చేసి పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరు టీ పౌడర్ లో హానికరమైన పదార్ధాలను కలుపుతున్నట్లు గుర్తించారు. 300 కిలోల వదులుగా ఉండే టీ పొడి, 200 కిలోల కొబ్బరి చిప్పల పొడి, నాన్-ఫుడ్-గ్రేడ్ ఎరుపు, నారింజ రంగులు ఒక్కొక్కటి 5 కిలోలు, చాక్లెట్, ఏలకులు, పాలు వంటి కృత్రిమ రుచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కల్తీగా అడ్డాగా భాగ్యనగరం:ఎన్‌సిఆర్‌బి వెల్లడి
కాగా కల్తీకి హైదరాబాద్ అడ్డగా మారినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో పేర్కొంది. 19 నగరాల్లో సర్వే చేయగా కల్తీలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ లో గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు అయ్యాయని నివేదికలో పేర్కొంది. సిటీలోని హోటల్స్‌లో కనీసం నాణ్యత పాటించడం లేదని క్రైమ్ రికారడ్స్ బ్యూరో వివరించింది. 62 శాతం హోటల్స్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు నివేదికలో పేర్కొంది. ఈ అల్లం, వెల్లుల్లితో చేసిన పదార్థాలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News