- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 15,754 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా 15,220 మంది బాధితులు కరోనా మహామ్మారి నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 47 మరణాలు సంభవించాయి. దేశంలో ప్రస్తుతం 1,01,830 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3.47 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 209.27 కోట్ల మందికి కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
- Advertisement -