Wednesday, January 15, 2025

158 డ్రోన్లను కూల్చేసిన రష్యా

- Advertisement -
- Advertisement -

రష్యాలో అనేక ప్రాంతాలను లక్షంగా చేసుకుని దూసుకొచ్చిన 158 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. మాస్కో సహా మరో తొమ్మిది ప్రాంతాలపై అర్ధరాత్రివేళ ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న కుర్క్ , బ్రయాన్స్, వొరోనెజ్, బల్లోరోడ్ ప్రాంతాల్లో 122 డ్రోన్లు కూల్చినట్టు రష్యా అధికారులు తెలిపారు.

బ్రయాన్స్ ప్రాంతం భూభాగంపై భారీ యూఏవీ డ్రోన్‌ను తమ దళాలు తిప్పి కొట్టాయని ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ బోగోమాజ్ వెల్లడించారు. ఇక మూడు డ్రోన్లు కషీరా బొగ్గు ఆధారిత పవర్ స్టేషన్‌ను ఢీకొట్టేందుకు ప్రయత్నించాయని స్థానిక అధికారి తెలిపారు. ఈ దాడుల కారణంగా నగర సరిహద్దు లోని బొగ్గు ఆథారిత విద్యుత్ ప్లాంట్ దెబ్బతిన్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News