Friday, November 22, 2024

దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కరోనా అలర్ట్ జారీ చేసింది. దేశంలో కేసులు పెరుగుతున్నవేళ ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే సోమవారం రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 10.11 తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నది.

గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కొత్తగా 1590 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గత 146 రోజుల్లో ఒకే రోజు ఇంతపెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,47,02,257 కు చేరింది. గత 24 గంటల్లో ఆరుగురు మరణించారు.

దీంతో ఇప్పటివరకు 5,30,824 మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా మృతి చెందిన వారిలో మహారాష్ట్రలో ముగ్గురు ఉండగా, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు 910 మంది కోలుకున్నారు. మొత్తం 4,41,62,832మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. మరో 8601 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 98.79 శాతం మంది కోలుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News