- Advertisement -
న్యూఢిల్లీ : రోజూ 17 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు కాగా, తాజాగా 16 వేల దిగువకు అవి చేరాయి. అయితే వీటిలో మహారాష్ట్ర , కేరళ, రాష్ట్రాల నుంచే సగానికి పైగా కేసులు ఉంటున్నాయి. ఇక క్రియాశీల కేసులు భారీగా పెరుగుతూఏ 90 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం 3,63,103 పరీక్షలు చేయగా, 15, 940 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వీటిలో మహారాష్ట్ర నుంచి 4205, కేరళ నుంచి 3981 కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉంది. శుక్రవారం 20 మరణాలు సంభవించగా, మొత్తం మరణాల సంఖ్య 5,24,974 కు చేరింది. శుక్రవారం 12,425 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4.27 కోట్లు చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 91,779 బ చేరింది. శుక్రవారం 15,73,341 మందికి వ్యాక్సినేషన్ కాగా, ఇప్పటివరకు 196.94 కోట్ల టీకాలు పంపిణీ అయ్యాయి.
- Advertisement -