Wednesday, January 22, 2025

15న ఎంఏసి పాలకమండలి ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మిర్యాలగూడ(అవంతిపురం) వ్యవసాయ మార్కెట్ కమిటీ నూ తన పాలకవర్గం ఈనెల 15న మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, రాజ్యసభ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి హాజరు కానున్నారు.

గురువారం అవంతిపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏఎంసి నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాట్లను స్వయంగా ఎమ్మెల్యే భాస్కర్‌రావు పర్యవేక్షించారు. ఏర్పాట్లకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జి ల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డిసిఎంఎస్ వైస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, కుందూరు వీరకోటిరెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కుర్ర విష్ణు, అడవిదేవులపల్లి జడ్పిటిసి కుర్ర శ్రీనివాస్, పిఏసిఎస్ ఛైర్మన్ రామకృష్ణ, డిసిసిబి డైరెక్టర్ బంటు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, పాలుట్ల బాబయ్య, నూతన పాలకవర్గ సభ్యులు, మార్కెట్ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News