Sunday, December 22, 2024

చంపుతామని సిద్ధరామయ్యకు బెదిరింపులు.. 16 మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

16 Arrested For Sending Death Threats To Siddaramaiah

బెంగళూరు : కర్టాటక మాజీ సీఎం, కాంగెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్యను చంపుతామని బెదిరించిన కేసులో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కొడగు జిల్లాకు చెందిన వారు కాగా, కుశాల్ నగరలో తొమ్మిది మందిని, మడికేరిలో ఏడుగురిని అరెస్టు చేసినట్టు కొడగు ఎస్పీ కెప్టెన్ అయ్యప్ప పేర్కొన్నారు. దీనిపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పదిస్తూ దీనిపై తాను డీజీపికి ఫోన్ చేసి మాట్లాడానని, పోలీసుల దర్యాప్తు సాగుతుందని చెప్పారు. ప్రతిపక్ష నేతకు తగిన భద్రత కల్పించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా కొడగులో సిద్ధ రామయ్య శుక్రవారం పర్యటించారు. ఆయన పర్యటన సందర్భంగా పలువురు నల్ల జెండాలను ప్రధర్శించడంతోపాటు కారుపై కోడిగుడ్లను విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News