Sunday, December 22, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల్లో దళితులకు 16% కాంట్రాక్టు ఏజెన్సీలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ”ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో 16% దళితులకు కేటాయిస్తున్నాం. వంద పడకలలోపు ఆస్పత్రిని ఒక కేటగిరిగా.. వంద పడకలకు పైగా ఉన్న ఆస్పత్రులను మరో కేటగిరిగా విభజించాం. ఏయే దావఖానాల్లో రిజర్వ్ చేయాలో డ్రా ద్వారా పారదర్శకంగా నిర్ణయించాం. మొత్తం 56 ఆస్పత్రులను దళితులకు కేటాయించడం జరిగింది. వీటికి త్వరలో టెండర్లు పిలుస్తారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండర్లు నిబంధనల్లో మార్పులు చేశాం. ఒక్క టెండర్ వచ్చిన పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించాం. ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం ఒక్కో బెడ్ కు ఇచ్చే చార్జీలను రూ.5000 నుంచి రూ. 7500కు పెంచడం జరిగింది. ఇందుకోసం ప్రభుత్వం అదనంగా ఏటా రూ.325 కోట్లు ఖర్చు చేస్తున్నది. డైట్ ఛార్జీలను సైతం రెట్టింపు చేశాం. మెడికల్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఎలా అమలు చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గతంలో నీటిపారుదల శాఖలో జరిగే టెండర్లలో 21% ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తూ జీవో 59 విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది. ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 300కు పైగా షాపుల్లో గల్లాపెట్టెల మీద దళితులు కూర్చున్నారు” అని చెప్పారు.

16% Contract Agencies for Dalits in Govt Hospitals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News